భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తనకు వైరస్ సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని... సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఎంపీ - Bhuvanagiri MP Latest News
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని... ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఎంపీ
ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ తనకు అప్పగించిన దౌల్తాబాద్ మండల బాధ్యతలను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకలో ప్రజలు తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ విజయానికి దోహదం చేస్తాయని వెల్లడించారు.