యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో గడిచిన 24 గంటల్లో 22 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 61 రాపిడ్ టెస్ట్‌లు నిర్వహించగా.. 23మందికి నిర్ధరణ అయినట్లు వైద్యులు డాక్టర్ కిశోర్ కుమార్, డాక్టర్ చైతన్య కుమార్ తెలిపారు.
మోత్కూరు మండలంలో 22మందికి కరోనా పాజిటివ్ - మోత్కూరు మండలం కొవిడ్ వార్తలు
కరోనా రెండో దశలో క్రమక్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఒక్కరోజే 22మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలను తప్పక పాటించాలని వైద్యులు సూచించారు.
Corona cases, covid cases, Mothkur mandal
కరోనా రెండో దశ రోజు రోజుకు విస్తరిస్తున్నందున.. ప్రజలు కొవిడ్ జాగ్రత్తలను తప్పక పాటించాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా.. టెస్టులు చేయించుకోవాలన్నారు. పటిమట్ల గ్రామంలో 3 కేసులు నమోదు అయ్యాయి.
ఇదీ చూడండి:ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల