యాదగిరి గుట్ట మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు నివారణ చర్యలు కట్టుదిట్టం చేశారు. నేటి నుంచి పలు ఆంక్షలు అమల్లోకి తీసుకొని వచ్చారు. దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా విజృంభణ.. యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో ఆంక్షలు - యాదగిరి గుట్ట మున్సిపాలిటీ వార్తలు
యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు పలు ఆంక్షలు విధించారు. దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అనుమతి ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు.
yadadri
షాపుల వద్ద వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవరైనా దుకాణాలు తెరిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేసేందుకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తామన్నారు.