తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో కరోనా.. వలస కార్మికుల్లో ఇద్దరికి పాజిటివ్ - Corona in Yadadri district .. Two of the migrant workers are positive

యాదాద్రి జిల్లాకు వచ్చిన వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఆలేరు మండలం శారాజిపేట్ కు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Corona in Yadadri district .. Two of the migrant workers are positive
యాదాద్రి జిల్లాలో కరోనా.. వలస కార్మికుల్లో ఇద్దరికి పాజిటివ్

By

Published : May 16, 2020, 2:28 PM IST

ఈనెల పదకొండవ తేదీన..యాదాద్రి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట్ కు వచ్చిన వలస కార్మికుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన నలుగురు వలస కూలీలను.. అదే గ్రామంలోని స్కూల్ లో క్వారంటైన్ చేశారు.

జనగామకు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల వీరికి పరీక్షలు నిర్వహించగా నలుగురిలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు వైద్యా అధికారులు తెలిపారు. బస్సు దిగిన అనంతరం కూలీలను గ్రామానికి తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ తో పాటు మరో పదకొండు మందిని హోం క్వారంటైన్ లో వైద్యులు పరీక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details