యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిసర ప్రాంతాల్లో కోళ్లు, చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. రేణుకుంటలో 100 రూపాలయలకే రెండు కోళ్లు విక్రయిస్తున్నారు. ఆలేరులోని ఓ దుకాణంలో కిలో చికెన్ రూ.50కి అమ్ముతున్నారు. కరోనా రాక ముందు కిలో రూ.190 పలికిన చికెన్.. కరోనా భయంతో రూ.50కు తగ్గింది.
కరోనా భయంతో తగ్గిన చికెన్ ధరలు
కరోనా దెబ్బకు పౌల్ట్రీ విలవిలాడుతోంది. కోళ్లు,చికెన్ ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. యాదాద్రి జిల్లా రేణుకుంటలో 100 రూపాలయలకే రెండు కోళ్లు విక్రయిస్తున్నారు. ఆలేరులోని ఓ దుకాణంలో కిలో చికెన్ రూ.50కి అమ్ముతున్నారు.
కరోనా భయంతో తగ్గిన చికెన్ ధరలు
చికెన్ తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందన్న పుకార్లు నమ్మొద్దని విక్రయదారులు కోరుతున్నారు. కోళ్లు అమ్ముడుపోక నష్టం వస్తోందని పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు