యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిధిలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మోత్కూరు మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి పాజిటివ్‌గా తేలింది. మండల పరిధిలోని పొడిచేడు గ్రామంలో నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 75 మందిని పరీక్షించగా.. 22 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క శనివారం నాడే.. మోత్కూరు పరిధిలో 43 కేసులు నమోదైనట్టు మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కిషోర్ కుమార్, చైతన్య కుమార్ తెలిపారు.
మోత్కూరు మున్సిపాలిటీలో కరోనా విజృంభణ! - కొవిడ్-19 కేసులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మండలం కరోనా కేసులతో గజగజ వణికిపోతున్నది. ఒక్కరోజులోనే.. మండల పరిధిలో 43 కేసులు నమోదు కావడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాజిటివ్‌గా తేలిన అందరినీ హోం ఐసోలేషన్‌కి తరలించినట్టు వైద్యులు తెలిపారు.
మోత్కూరు మున్సిపాలిటీలో కరోనా విజృంభణ!