యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 123 మందికి పరీక్షలు నిర్వహించగా... 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యాధికారి నరేశ్ కుమార్ తెలిపారు. పాజిటివ్ నమోదైన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు.
కరోనా కలవరం.. యాదాద్రిలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు - యాదాద్రిలో కరోనా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు.
మోత్కూరు మండలం పోడిచేడు గ్రామంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 30 కేసులు నమోదు కావడంతో... ఆ గ్రామ సర్పంచ్ మధు యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో వీధి వీదిన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని... గ్రామ పంచాయతీ సిబ్బందితో పిచికారీ చేయించారు. గ్రామంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... మండల అధికారులు, వైద్యాధికారులు స్పందించి... పోడిచేడు గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చూడండి:టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్