తెలంగాణ

telangana

ETV Bharat / state

'అత్యవసరమైతేనే పోలీస్‌స్టేషన్‌కు రండి.. ప్రజలకు యాదాద్రి పోలీసుల సూచన' - corona in yadadri

Corona Cases in Yadadri PS: యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కరోనా కలకలం రేపుతోంది. 40 మంది పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అత్యవసరమైతేనే పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు... ప్రజలకు సూచించారు.

CORONA CASES IN YADADRI POLICE STATION
CORONA CASES IN YADADRI POLICE STATION

By

Published : Jan 21, 2022, 11:56 AM IST

Corona Cases in Yadadri PS: ఫ్రంట్‌ లైన్‌ వారియర్లను కరోనా కంగారెత్తిస్తోంది. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కొవిడ్‌ కలకలం రేపుతోంది. స్టేషన్‌లో 28 మంది పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో 12 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. ఏసీపీతో పాటు ఇద్దరు సీఐలు, పలువురు ఎస్​ఐలు , కానిస్టేబుళ్లు వైరస్‌ బారిన పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

యాదగిరిగుట్ట పట్టణ, గ్రామీణ స్టేషన్‌లతో పాటు ట్రాఫిక్ విభాగాల్లో ఈ నెల7 నుంచి 13 రోజుల్లో 40 కేసులు నమోదయ్యాయి. ఆలేరు నియోజికవర్గంలోని పలు పోలీస్‌స్టేషన్లలో సిబ్బందికి కరోనా సోకినట్టు తేలింది. కొవిడ్‌ రోజరోజుకు విజృంభిస్తుండగా..ప్రజలు అత్యవసరమైతే తప్ప స్టేషన్‌కు రావద్దని సూచించారు. సమస్య తీవ్రతను బట్టి గుంపులుగా రావద్దన్నారు. డయల్‌ 100కి ఫోన్‌ చేస్తే సిబ్బంది వచ్చి సేవలు అందిస్తారని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:అదుపుతప్పి కారు బోల్తా.. ఆరుగురికి తీవ్రగాయాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details