యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోంది. మహమ్మారిపై దండయాత్ర చేపట్టేలా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు సఫలం అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వేతో పాటు, లాక్డౌన్ మంచి ప్రభావం చూపిస్తోందని వైద్యాధికారులు అంటున్నారు.
యాదాద్రిలో తగ్గుముఖం పడుతోన్న కొవిడ్ కేసులు
యాదగిరిగుట్టలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫీవర్ సర్వేతో పాటు, లాక్డౌన్ మంచి ప్రభావం చూపిస్తోందని వైద్యాధికారులు అంటున్నారు. కరోనా రెండో దశ కొత్తలో ఈ ప్రాంతంలో ఒకేరోజు 50 కేసులు నమోదైన సందర్భాలున్నాయి.
covid cases in yadadri
కరోనా రెండో దశ కొత్తలో ఈ ప్రాంతంలో ఒకేరోజు 50 కేసులు నమోదైన సందర్భాలున్నాయి. యాదాద్రి దేవస్థానంలో 100కు పైగా మహమ్మారి బారిన పడి.. కొందరు కోలుకోగా వారిలో మరికొందరు మృత్యువాత పడ్డారు. వైద్య సిబ్బంది కల్పించిన అవగాహనతో మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకం, స్వీయ నియంత్రణ చేపట్టడం వంటివి కేసుల తగ్గుదలకు కారణమయ్యాయి.