తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాకారులతో కరోనాపై అవగాహన - awareness on corona in bhuvanagiri

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణపూర్​లో రాచకొండ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులతో వీధుల్లో తిరుగుతూ వైరస్​ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

corona awareness in yadadri bhuvanagiri district by artists
కళాకారులతో కరోనాపై అవగాహన

By

Published : May 11, 2020, 2:47 PM IST

లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని రాచకొండ కమిషనర్​ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్​ నారాయణపూర్​లో కళాకారులతో విచిత్ర వేషధారణతో వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు.

కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు సూచించారు. బయటకు వెళ్లిన వారు తప్పకుండా మాస్కు ధరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details