తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూరులో నిర్బంధ తనిఖీలు - CORDON SEARCHES IN MOTKURU

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 40 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, 2 ఆటోలు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

CORDON SEARCHES IN MOTKURU

By

Published : Aug 6, 2019, 10:33 PM IST

యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరులోని సాయినగర్ కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కట్టడి ముట్టడిలో సరైన ధ్రువపత్రాలులేని 40 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, 2 ఆటోలు, 24 బీర్లు, 3 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. కార్యక్రమంలో ఇద్దరు ఏసీపీలు, నల్గులు సీఐలు, 18 మంది ఎస్సైలు, 100 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కొత్త వ్యక్తులెవరైనా కన్పిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ తెలిపారు. అన్ని వీధుల్లో సీసీ కెమరాలు అమర్చు కోవాలని సూచించారు.

మోత్కూరులో నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details