యాదాద్రి భువనగిరిజిల్లా రూస్తాపూర్ గ్రామంలో డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 120 మంది పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సమాజంలో అసాంఘిక శక్తులను, అక్రమ వ్యాపారులను గుర్తించడానికి కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని భవిష్యత్తులో ఈ కార్యక్రమం విడతల వారిగా చేపడుతామని వెల్లడించారు.
'సామాజిక భద్రతా పెంచేందుకే నిర్బంధ తనిఖీలు' - రుస్తాపూర్లో నిర్బంధ తనిఖీలు
ప్రజల్లో సామాజిక భద్రతా భావం పెంచేందుకే కట్టడి ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
'సామాజిక భద్రతా పెంచేందుకే నిర్బంధ తనిఖీలు'
కరోనా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమంగా బెల్ట్ షాపులు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.