భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 16 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను, ఒక రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరాల నియంత్రణకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేందుకు కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల భద్రతాపరమైన సమస్యలతో పాటు ఇతర సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏసీపీ భుజంగరావు హామీ ఇచ్చారు.
'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ' - CORDON SEARCH AT BHUVAGIRI CITY
ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంతో నేరాల నియంత్రణ జరుగుతుందని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలో సుమారు 150 మంది సిబ్బందితో కట్టడి ముట్టడి నిర్వహించారు.

CORDON SEARCH AT BHUVAGIRI CITY
'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ'
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత