తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో బలిపీఠానికి రాగి తొడుగులు - Flooring of the Yadadri temple on the ground with dark rocks

యాదాద్రి ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్​పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఉన్న బలిపీఠానికి రాగి తొడుగులు సైతం అమర్చారు.

Copper gloves to the altar in the Yadadri Temple at yadagirigutta
యాదాద్రి ఆలయంలో బలిపీఠంకు రాగి తొడుగులు

By

Published : Dec 27, 2019, 11:29 AM IST

యాదాద్రి ఆలయ నిర్మాణంలో కృష్ణ శిలతో నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్​పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. కాలి నడకన వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లోరింగ్ దోహదపడుతుంది. ఆ మేరకు ప్రత్యేక బృందంతో సీసం పూత పనులు చేపట్టారు.

మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బలిపీఠానికి రాగి తొడుగులు అమర్చారు. ధ్వజస్తంభానికి సంబంధించిన రాగి తొడుగులను త్వరలో చెన్నైకి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఆ తొడుగులకు బంగారం ఎంత మేరకు అవసరం అవుతుందనే దానిపై నివేదిక తయారు చేసి చెన్నైకి పంపనున్నట్లు సమాచారం. ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాలకు తొడుగులను ఆలయ ప్రాంగణంలోనే తయారు చేస్తున్నారు.

యాదాద్రి ఆలయంలో బలిపీఠంకు రాగి తొడుగులు

ఇదీ చూడండి : నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details