నాలుగైదు రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. రైతులు ఇతర పంటలు సాగు చేసి నష్టపోకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ, రైతు బంధు తదితర అంశాలపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ అనిత రామచంద్రన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా వ్యవసాయ ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు అవసరమే పంటలే వేయాలి...
జిల్లాలో లక్ష ముప్పై వేల ఎకరాల్లో వరి, లక్ష 74 వేల ఎకరాల్లో పత్తి, 3 లక్షల 60 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో కంది సాగు 50 వేల ఎకరాలు వేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. నియంత్రిత సాగు విధానంలో రైతులను సంఘటిత పరచడమే లక్ష్యమన్నారు. ప్రజలు ఏం తింటున్నారు.. ఏ పంటలు పండిస్తే లాభాదాయకమో అవే పంటలు వేయాలని మంత్రి సూచించారు.
'ప్రజల ఆహారం కోసమే నియంత్రిత వ్యవసాయ విధానం' ఇవీ చూడండి : ఆర్టీసీ బస్సులోనే గర్భిణీ ప్రసవం