తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాల దృష్ణ్యా నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు

వర్షాల దృష్ణ్యా నిరంతర పర్యవేక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా జరిగిన ఆస్తి, పంట నష్టాల వివరాలను యంత్రాంగానికి తెలియజేసేందుకు ఈ కంట్రోల్ ​రూమ్​ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్​ తెలిపారు.

control-room-for-rain-problems-in-yadadri-bhuvangiri-district
వర్షాల దృష్ణ్యా నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు

By

Published : Aug 15, 2020, 10:09 PM IST

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో నిరంతర పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆస్తి, పంట నష్టాల వివరాలను యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలను తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నంబర్​ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెడ్​క్వార్టర్స్ లోనే ఉండాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నష్టం వివరాలను టోల్ ఫ్రీ నెంబర్​కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు.

ఇవీ చూడండి:ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

ABOUT THE AUTHOR

...view details