తెలంగాణ

telangana

ETV Bharat / state

తుది దశకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటితో పరిసమాప్తి - యాదాద్రి జిల్లా

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తుది అంకానికి చేరుకున్నాయి. గురువారం స్వామి వారు బాలాలయంలో దివ్య విమాన రథంపై... కొండ కింద ప్రచార రథంపై ఊరేగారు. వేడుకల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు మంగళవారం చేపట్టగా.. బుధవారం కల్యాణం, తిరుకల్యాణ వేడుకలు నిర్వహించారు. 11 రోజుల పాటు సాగే ఉత్సవాలు... రేపటితో పరిసమాప్తి కానున్నాయి.

తుది దశకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటితో పరిసమాప్తి
తుది దశకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటితో పరిసమాప్తి

By

Published : Mar 6, 2020, 6:14 AM IST

తుది దశకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. రేపటితో పరిసమాప్తి

యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. బుధవారం నాడు వివాహ వేడుకల్లో తడిసిముద్దయిన నారసింహుడు.. గురువారం ఆలయ మండపంతోపాటు పుర వీధుల్లో ఊరేగారు. ఉదయం బాలాలయంలో దివ్య విమాన రథంపై.. రాత్రికి కొండ కింద ప్రచార రథంపై తిరుగుతూ.. భక్తులకు అభయ ప్రదానం చేశారు. మానవ జన్మకు ముక్తి ప్రసాదించేలా.. తిరువీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు, నామ సంకీర్తనలతో... ఆగమ శాస్త్రోక్తంగా ఉత్సవం సాగింది. ఊరేగింపునకు ముందు రథ బలి, ఉత్సవ మూర్తులకు అలంకార సేవ చేపట్టారు.

రేపటితో పరిసమాప్తి..

11 రోజుల పాటు జరుగుతున్న బ్రహ్మోత్సవాలు.. గత నెల 26న స్వస్తి వాచనంతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం వివాహం, రాత్రి తిరుకల్యాణ వేడుకలు చేపట్టగా... పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకుముందు రోజు మంగళవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు.. ఎదుర్కోలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఈ మూడు ప్రధాన ఘట్టాలతోపాటు.. నిత్యం స్వామి వారికి ఉదయం, రాత్రి వేళల్లో వాహన సేవలు జరిగాయి. శనివారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం కార్యక్రమాలతో... వేడుకలు పరిసమాప్తి అవుతాయి. ఆలయ పునర్నిర్మాణాల దృష్ట్యా వరుసగా నాలుగో ఏడాది సైతం.. బాలాలయం వేదికగా ఉత్సవాలు జరిగాయి.

ఇవీ చూడండి:ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details