రాష్ట్రానికి వన్నెతెచ్చే తరహాలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధిపరిచే క్రమంలో విశాల రహదారుల నిర్మాణ పనులు మరింత ముమ్మరమయ్యాయి. కొండ చుట్టూ చేపట్టిన ఆరు వరుసల రహదారిలో నాలుగు చోట్ల వలయ(సర్కిల్) రహదారుల నిర్మాణం జరుగుతోంది. కొండ కింద ప్రధాన రహదారిలోని సింహ (వైకుంఠ) ద్వారం చెంత 25 వ్యాసంతో మీటర్ల వలయం నిర్మితమవుతోంది.
yadadri: యాదాద్రిలో నాలుగు వలయ రహదారులు - telangana latest news
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. కొండ చుట్టూ చేపట్టిన ఆరు వరుసల రహదారిలో నాలుగు చోట్ల వలయ(సర్కిల్) రహదారుల నిర్మాణం జరుగుతోంది.
![yadadri: యాదాద్రిలో నాలుగు వలయ రహదారులు yadadri: యాదాద్రిలో నాలుగు వలయ రహదారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:29:10:1623473950-tg-nlg-81-12-yadadri-valaya-rahadhari-av-ts10134-12062021101147-1206f-1623472907-913.jpg)
yadadri: యాదాద్రిలో నాలుగు వలయ రహదారులు
ఇందు కోసం అక్కడ ఇళ్లను తొలగించారు. క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులకు రవాణా ఇక్కట్లు కలగకుండా రహదారుల వసతి కల్పనకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా విస్తరణ పనులు చేపడుతోంది.