ఆదాయ పన్ను శాఖ దాడులను.. రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అభివర్ణించారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య ఇంటిపై జరిగిన ఐటీ సోదాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి నల్గొండలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న కుట్రపూరిత చర్యలో భాగంగానే దాడులు జరిగాయంటూ ఆయన మండిపడ్డారు.
'బీసీలను.. రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారు' - యాదాద్రి జిల్లా వార్తలు
యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పర్యటించారు. ఆలేరు నియోజకవర్గ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య ఇంటిపై జరిగిన ఐటీ సోదాలను ఆయన తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
ఐలయ్యపై.. సొంత పార్టీ వాళ్లే ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారని వీహెచ్ ఆరోపించారు. ఇలాంటి వారి వల్ల పార్టీ నష్టపోవాల్సి వస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు.. తక్షణమే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:'సాగర్' పోరుకు సిద్ధమైన ప్రధాన పార్టీలు.. ప్రచారమే తరువాయి..!