Congress Sarvodaya Padayatra: మార్చి 14 సోమవారం నుంచి మాజీ ఎంపీ, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఛైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ పాదయాత్రను ప్రారంభిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి యాత్ర ప్రారంభం కానుందన్నారు. పేదల భూ సమస్యల పరిష్కారం కోసం సర్వోదయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే సర్వోదయ పాదయాత్ర 26 రోజులపాటు తెలంగాణలో ఉంటుందని... అనంతరం వార్ధా వరకు కొనసాగుతుందని మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం వివరించారు.
నేటి నుంచి మాజీ ఎంపీ సర్వోదయ పాదయాత్ర.. పాల్గొననున్న రాహుల్ గాంధీ - congress sarvodaya padayatra news
Congress Sarvodaya Padayatra: మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ సర్వోదయ పాదయాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి.. మహారాష్ట్రలోని వార్ధా వరకు యాత్ర కొనసాగనుంది. భూదాన్ కార్యక్రమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు మీడియాకు తెలిపారు.
సర్వోదయ పాదయాత్ర వివరాలను గాంధీభవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్, పటేల్ రమేశ్ రెడ్డి, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షులు రవితోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. భూదాన్ కార్యక్రమం ప్రారంభించి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ యాత్రలో ఒక రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. సోమవారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆదివారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొంటారని మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భాజపా గెలవడానికి కేసీఆరే కారణం: మధుయాష్కీ