మూసీనదిని పరిరక్షించాలని కేంద్రాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నమామి గంగ తరహాలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. కాలుష్య నియంత్రణ కోసం ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
మూసీనదిని పరిరక్షించండి: ఎంపీ కోమటిరెడ్డి - congress mp komatireddy venkatreddy speech
మూసీని కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నదిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. మూసీ ఒడ్డున విరివిగా చెట్ల పెంపకాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
congress mp komatireddy venkatreddy
మూసీ ఒడ్డున విరివిగా చెట్ల పెంపకాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మూసీని కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని నదిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. పరిశ్రమలు మూసీని కలుషితం చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. నదికి పూర్వ వైభవం తెస్తే కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి:'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'