రాష్ట్రంలో ఫార్మాసిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మా సిటీ అనుమతులు రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు.
'రాష్ట్రంలో ఫార్మాసిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాలి' - కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్రంలో ఫార్మాసిటీ భూ అక్రమాలు జరుగుతున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కోరారు.
komati reddy
పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మాసిటీ అని ఆరోపించారు. రైతుల నుంచి ఎకరా 8లక్షలకు కొని ఫార్మా కంపెనీలకు కోటిన్నరకు అమ్ముతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. ఫార్మాతో చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యమవుతాయని.. కేంద్రం తక్షణం దృష్టి సారించాలని కోమటిరెడ్డి కోరారు.
ఇదీ చూడండి:'దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో'