తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ - యాదాద్రి భువనగిరి జిల్లా సమాచారం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రాంచంద్రుడు సమక్షంలో సంతకాలు సేకరించారు.

Congress leaders signatures collect to oppose Agriculture Acts
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

By

Published : Nov 4, 2020, 3:32 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రాంచంద్రుడు విమర్శించారు.

రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని తెలిపారు. కేసీఆర్, మోదీ రైతు వ్యతిరేకులని ఆయన ఆరోపించారు. నూతన చట్టాలతో కలిగే నష్టాలపై రైతులను చైతన్యవంతులను చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మోత్కూర్ మండల ఉపాధ్యక్షుడు పురుగుల నరసింహ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మందుల సురేష్, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, ఉపాధ్యక్షులు అన్నెపు నర్సింహ, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details