తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పిల్లలకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్​ నేతలు

యాదాద్రి జిల్లా రుస్తాపూర్​లో మరణించిన బూడిద నర్సింహ్మ గౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను... ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య (beerla ilaiah) పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని ముగ్గురు ఆడ పిల్లలకు రూ.50 వేల ఆర్థిక సాయంతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) సహకారంతో మరో లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్​ చేస్తామని పేర్కొన్నారు.

Congress leaders provided financial assistance
ఆ పిల్లలకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్​ నేతలు

By

Published : Jun 9, 2021, 5:15 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్​లో మరణించిన బూడిద నర్సింహ్మ గౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్ల అయిలయ్య(beerla ilaiah) పరామర్శించారు. తండ్రి చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న… మృతుని ముగ్గురు ఆడపిల్లలను బీర్ల అయిలయ్య(beerla ilaiah) ఓదార్చారు.

కాంగ్రెస్ పార్టీ, బీర్ల ఫౌండేషన్ అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. బీర్ల ఫౌండేషన్ నుంచి చిన్నారులైన ముగ్గురు ఆడపిల్లల పేరు మీద రూ.50 వేలు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) సహకారంతో… మరో లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తామని అయిలయ్య హామీ ఇచ్చారు.


ఇదీ చూడండి:Eatala Rajender: ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడ కేసీఆర్​ వరాలు

ABOUT THE AUTHOR

...view details