యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కరోనా మహమ్మారితో దేశ ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతున్నాయని నాయకులు మండిపడ్డారు.
కరోనా వేళ పెట్రో ధరల పెంపు సరికాదు: కాంగ్రెస్ - diesel rates hike
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
'ఓ వైపు ప్రాణాలు పోతుంటే... పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా?'
వ్యవసాయ పనులను రైతులు పూర్తిగా ట్రాక్టర్ ద్వారా చేసుకుంటున్నారని... ఇప్పుడు డీజిల్ రేట్లు ఆకాశాన్నంటడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండగోని రామచంద్రు, అవిలిమళ్ళు, మల్లారెడ్డి, మందుల సురేశ్, గుండు శ్రీను, కారిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.