యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు - Congress leaders participated in rajeev gandhi death anniversary
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కాంగ్రెస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హైపోక్లోరైట్ ద్రావనాన్ని పిచికారీ చేసి శుభ్రపరిచారు. 20 మంది వలస కార్మికులకు నగదు రూపంలో ఆర్థిక సాయం అందించి... నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మోత్కూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రాంచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగారిగారి ప్రితం, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోమిరెడ్డి హాజరయ్యారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు.
TAGGED:
Yadadri news