యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న ప్రజలను ఆదుకోవాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని యాదగిరిగుట్టలో రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
'బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం' - ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నాయకుడు బీర్ల ఐలయ్య దీక్ష
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ హామీని మర్చిపోయారని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
ఈ విషయంలో సీఎం మాట తప్పారని ఆయన మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం అందించాకే రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ తరపున పెద్దఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ గుడ్ల వరలక్ష్మి పాల్గొన్నారు.
ఇదీ చూడండి :కొవిడ్ టీకా.. దశలవారీగా అందరికీ వేస్తాం: మంత్రి సబిత
Last Updated : Jan 16, 2021, 7:43 PM IST