యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అయితే ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చేయాల్సిన కార్యక్రమాన్ని ప్రోటోకాల్ విస్మరించి ఆమె భర్త... డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
'ఎమ్మెల్యేకు బదులుగా ఆమె భర్త అధికారాన్ని చలాయిస్తున్నారు' - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త ప్రోటోకాల్‌ను విస్మరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేకు బదులుగా ఆయన శంకుస్థాపన చేశారని అన్నారు.
ఎమ్మెల్యే గొంగిడి సునిత భర్త ప్రోటోకాల్‌ను విస్మరించారని ఆరోపణ
ప్రస్తుతం నియోజకవర్గంలో గొంగిడి సునీత నామ మాత్రపు ఎమ్మెల్యేగానే ఉన్నారని విమర్శించారు. ఆమె భర్త పూర్తి అధికారాన్ని చలాయిస్తున్నారని.... అందుకు ఈ కార్యక్రమమే నిదర్శనమని ఆరోపించారు. ప్రోటోకాల్‌ను దుర్వినియోగ పరచి ఎమ్మెల్యే భర్త ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Mother arrest: కుమారున్ని కొట్టి చంపిన కేసులో తల్లి అరెస్ట్