కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జన్మదినం సందర్భంగా భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్ మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో హత్యకు గురైన బాలికల కుటుంబాలకు రూ.10 వేలను అందించారు. అంబర్‌పేటలోని వీహెచ్ నివాసంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టిన రోజున హాజీపూర్ బాధితులకు వీహెచ్ ఆర్థికసాయం - vh birthday
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కానీ వీహెచ్ మాత్రం హాజీపూర్ వెళ్లి బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు.
పుట్టిన రోజున హాజీపూర్ బాధితులకు వీహెచ్ ఆర్థికసాయం