కరోనా వైరస్ నివారణ చర్యలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డ్రైవర్స్ కాలనీ, పద్మశాలీ కాలనీల్లో తన సొంత నిధులతో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతమ్ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రాజన్నగూడెం, దత్తప్పగూడెం గ్రామాల్లోని వీధుల్లో కూడా రసాయనాన్ని పిచికారీ చేయించారు.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు భాధ్యతగా మెలగాలని నాగరిగారి ప్రీతమ్ అన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫైళ్ల సోమిరెడ్డి, నాయిని ప్రవీణ్ కుమార్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పురుగుల నర్సింహ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సొంత నిధులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్ నేత
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలతో పాటు పలు గ్రామాల్లో తన సొంత నిధులతో తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
సొంత నిధులతో రసాయనాన్ని పిచికారీ చేయించిన కాంగ్రెస్ నేత
ఇవీ చూడండి: తెలంగాణ లాక్డౌన్లో వీటికి మినహాయింపులు