యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
తెరాస తీర్థం పుచ్చుకున్న యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త - Congress activists joins trs in yadadri news
యాదాద్రిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలు తెరాస గూటికి చేరారు. వీరిని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పార్టీలోకి ఆహ్వానించారు.

తెరాస తీర్థం పుచ్చుకున్న యాదాద్రి ఆలయ మాజీ ధర్మకర్త
అంతకు ముందు యాదగిరిగుట్టలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు శ్రీధర్ గౌడ్ వివరించారు.
ఇదీ చదవండి:'రెండువేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చేశారు'