యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి... మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా.. విపక్ష సభ్యులు అడ్డుకుని ఆందోళనకు దిగారు.
భువనగిరిలో రసాభాసగా మారిన బతుకమ్మ చీరల పంపిణీ
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తమను పిలువకుండా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తమను అవమానించారంటూ విపక్ష కౌన్సిలర్లు ఆందోళనకు దిగిన ఘటన భువనగిరిలో చోటు చేసుకుంది. అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భువనగిరిలో రసాభాసగా మారిన బతుకమ్మ చీరల పంపిణీ
కార్యక్రమానికి తమను పిలువలేదని విపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎమ్మెల్యే కార్యక్రమం మధ్యలోనే సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఛైర్మన్ అసభ్య పదజాలంతో దూషించారని కౌన్సిలర్లు ఆరోపించారు. ఛైర్మన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి
TAGGED:
sarees distribution news