కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నా.. కనీసం తమకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం లేదని యాదాద్రి జిల్లాలోని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెడికల్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు వినతిపత్రం అందజేశారు. వైద్య సిబ్బంది కుటుంబాలకు వెంటనే వ్యాక్సినేషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్ ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన - కొవిడ్ సంక్షోభంలో వైద్య సిబ్బంది
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మెడికల్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు వినతిపత్రం అందజేశారు. వైద్య సిబ్బంది కుటుంబాలకు వెంటనే వ్యాక్సినేషన్ వేయాలని కోరారు.
health department employees problems
కరోనా బారిన పడ్డ వైద్య సిబ్బందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కనీసం 10 శాతం ఆక్సిజన్ పడకలను ప్రత్యేకంగా కేటాయించాలని వారు కోరారు. సిబ్బందికి.. కేంద్రం ప్రకటించిన రూ. 50 లక్షల ప్రమాద బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరారు. వైద్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:Bandi sanjay: తెలంగాణకు జూన్, జులైలో 20లక్షల చొప్పున వ్యాక్సిన్లు