యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయ సాలహారాల్లో దేవతామూర్తుల విగ్రహాలను శిల్పులు పొందుపరుస్తున్నారు. నారసింహుడి దశావతారాలు, అష్టలక్ష్మీ విగ్రహాలు భగవద్గీతకు సంబంధించి మొత్తం 516 ముఖ్యమైన దేవతామూర్తుల విగ్రహాలను ప్రధానాలయం తిరుమాడ వీధులు, మాడ వీధులు, శివాలయ సాలహారాల్లో పొందుపరుస్తున్నామని శిల్పులు తెలిపారు. మొదట తిరుమాడ వీధుల్లో విగ్రహాల కూర్పు జరుగుతోంది.
యాదాద్రి ప్రధానాలయ సాలహారాల్లో విగ్రహాల కూర్పు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ప్రధానాలయ సాలహారాల్లో దేవతామూర్తుల విగ్రహాలను శిల్పులు పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం తిరుమాఢ వీధుల్లో విగ్రహాల కూర్పు జరుగుతోంది.
యాదాద్రి ప్రధానాలయ సాలహారాల్లో విగ్రహల కూర్పు