చైనా-భారత్ సరిహద్దుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్.. సంతోశ్ బాబు సేవలకు గుర్తింపుగా.. అతని సతీమణకి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కల్నల్ సంతోశ్ బాబు సతీమణి - Yadadri Bhubanagiri District news
యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా కల్నల్ సంతోశ్ బాబు సతీమణి సంతోషినిని రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసింది. కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు ఇవాళ ఆమె రిపోర్ట్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కల్నల్ సంతోశ్ బాబు సతీమణి
ఆ హామీ మేరకు యదాద్రి భువనగిరి జిల్లాకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ విధుల్లో చేరారు. జనవరి వరకు ఆమె విధులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు.