యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించిన కలెక్టర్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ధరణితో 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి: యాదాద్రి కలెక్టర్ - కలెక్టర్ అనితారామచంద్రన్ తాజా వార్త
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయిందని.. ఈసేవలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. యాదగిరి గుట్టలోని తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆమె పరిశీలించారు.
ధరణితో 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి: యాదాద్రి కలెక్టర్
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం అయిందని, 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగుస్తుందని ఆమె తెలిపారు. అక్కడక్కడ కొన్నిచోట్ల చిన్నచిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నప్పటికీ రిజిస్ట్రేషన్లకు మాత్రం ఆటంకం ఏర్పడడం లేదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ పట్ల పట్టాదారులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు.
ఇదీ చూడండి:ధరణి లాంటి పథకం ప్రపంచంలోనే ఉండదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్