యాదాద్రి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా చూడటంలో ఆశావర్కర్ల పాత్ర ముఖ్యమైనదని కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. ప్రాణాలు కాపాడే వారిని దేవుడంటారని.. ప్రజలను కరోనా బారి నుంచి కాపాడుతున్న ఆశావర్కర్లు, వైద్యులు నిజంగా దేవతేలేనని ప్రభుత్వ విప్ సునీత కొనియాడారు.
'ఆశావర్కర్లు నిజంగా దేవతలే'
కరోనా నియంత్రణ కోసం ఆశా వర్కర్లు, వైద్యులు పడుతున్న కష్టం వెలకట్టలేనిదని, వారికి పాదాభివందనం చేస్తున్నామన్న యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, ప్రభుత్వ విప్ సునీత అన్నారు.
'ఆశావర్కర్లు నిజంగా దేవతలే'
యాదగిరిగుట్టలో టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా టిటా అసోసియేషన్ తయారు చేసిన "టి- కన్సల్ట్" మొబైల్ అప్లికేషన్ను సునీత, అనితారామచంద్రన్లు ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో టీ - కన్సల్ట్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్న సునీత తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ఇంటి నుంచే స్వయంగా వైద్యులతో మాట్లాడి తమ ఆరోగ్య సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు.