ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రసాదంలో బొద్దింక కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షమవటంతో నిర్ఘాంతపోయారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం సరైంది కాదని భక్తులు అంటున్నారు.
యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక - Yadadri news
హైదరాబాద్‌కు చెందిన భక్తులు యాదాద్రికి శనివారం వచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. లడ్డు తెరిచి చూడగా బొద్దింక బయటపడటంతో నిర్ఘాంతపోయారు.
యాదాద్రి లడ్డూ ప్రసాదంలో బొద్దింక