తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ధర్నా.. అరెస్ట్​ చేసిన పోలీసులు - పోచంపల్లిలో కాంగ్రెస్​ నాయకుల ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కాంగ్రెస్​ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి రహదారిపై ధాన్యాన్ని పోసి నిరసన తెలిపారు. పోలీసులు.. ధర్నాను అడ్డుకుని వారిని అరెస్ట్​ చేశారు.

cngress leaders protest against agricultural bill in pochampally at yadadri district
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ధర్నా.. అరెస్ట్​ చేసిన పోలీసులు

By

Published : Nov 6, 2020, 4:52 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. హస్తం నేతలు, కార్యకర్తలు పోచంపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి, ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్​ చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని హస్తం శ్రేణులు విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని.. వారికి మద్దతుగా పోరాడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ చేశారు.

ఇదీ చూడండి:రైతులకు నష్టం కలిగితే సహించేది లేదు: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details