తెలంగాణ

telangana

By

Published : Jun 22, 2021, 3:03 PM IST

Updated : Jun 22, 2021, 3:21 PM IST

ETV Bharat / state

Cm Kcr: దత్తత గ్రామంలో సీఎం పర్యటన... గ్రామస్థులతో సహపంక్తి భోజనం

ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో, సోమవారం వరంగల్, యాదాద్రిలో పర్యటించారు. ఇవాళ ఆయన దత్తత గ్రామం వాసాలమర్రికి వచ్చారు. గ్రామస్థులతో సహపంక్తి భోజనాలు చేశారు.

CM
సీఎం పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) యాదాద్రి జిల్లాలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తున్నారు. వాసాలమర్రి ప్రజలు సీఎం (CM KCR)కు ఘనస్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని కోదండరామాలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేసిన అనంతరం వాసలమర్రిలోని కోదండరాముడి ఆలయానికి వెళ్లారు. ఆ తర్వాత గ్రామస్థులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్థుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు.

తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు తమ సమస్యలను సీఎంకు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను కేసీఆర్ (KCR) ఆదేశించారు. గ్రామస్థులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు ముఖ్యమంత్రి స్వయంగా వడ్డించారు. తర్వాత గ్రామసభలో పాల్గొన్నారు.

వాసాలమర్రిలో సీఎం కేసీఆర్

ఇదీ చదవండి:CM KCR: మాంత్రికుడి కథ చెప్పిన ముఖ్యమంత్రి.. వారికి చురకలు

Last Updated : Jun 22, 2021, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details