తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్వాపూర్​ రిజర్వాయర్​ పనులపై స్మితా సబర్వాల్ ఆరా - బస్వాపూర్​ రిజర్వాయర్​ను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్​ రిజర్వాయర్​ను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ సందర్శించారు. ప్రాజెక్టులో పూర్తయిన పనులు, మిగిలి ఉన్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

yadadri bhuvanagiri, smitha sabarwal, baswapuram reservoir
స్మితా సబర్వాల్​, యాదాద్రి భువనగిరి, బస్వాపురం రిజర్వాయర్​

By

Published : Jan 10, 2021, 7:34 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని బస్వాపూర్ రిజర్వాయర్​ను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల వివరాలను.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎంత శాతం పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్న పనులపై ఆరా తీశారు. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం, ఆనకట్ట ఎత్తు, నిర్వాసితులు, నష్టపరిహారం తదితర వివరాలను అడిగారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు పనుల పట్ల స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. రిజర్వాయర్​ నిర్వాసిత గ్రామం తిమ్మాపూర్ వాసులకు మరో చోట పునరావాసం ఏర్పాటు, నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ హరి రాం పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలు తెలుపుతూ వినతి పత్రం ఇవ్వడానికి కార్యదర్శి వద్దకు రాగా, పత్రాలను కలెక్టర్​కు ఇవ్వాలని సూచించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వం ప్రొటోకాల్​ పాటించడం లేదు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details