తెలంగాణ

telangana

ETV Bharat / state

వాసాలమర్రిలో స్మితా సబర్వాల్​ పర్యటన.. దళిత బంధు పనితీరుపై ఆరా

Smitha Sabharwal Visited vasalamarri village: సీఎం కేసీఆర్​ దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, అధికారులు​ పర్యటించారు. గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల యూనిట్లను పరిశీలించారు. గ్రామస్థులంతా ఐకమత్యంగా ఉంటే వాసాలమర్రి ఆదర్శ గ్రామంగా మారుతుందని స్మితా సబర్వాల్​ పేర్కొన్నారు.

వాసాలమర్రిలో స్మితా సబర్వాల్​ పర్యటన.
వాసాలమర్రిలో స్మితా సబర్వాల్​ పర్యటన.

By

Published : Jan 26, 2022, 5:19 PM IST

Smitha Sabharwal Visited vasalamarri village: సీఎం కేసీఆర్​ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు పథకం పనితీరును సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్​ పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేసీఆర్​ ఆదేశాల మేరకు అధికారుల బృందం.. గ్రామంలో పర్యటించింది. దళిత బంధు పథకం లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి స్మితా సబర్వాల్​.. యూనిట్లను పరిశీలించారు. పథకం ద్వారా లబ్ధిదారులు ఎటువంటి ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాలను క్షేత్ర స్థాయిలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికలో గ్రామసభ నిర్వహించారు.

రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో స్మితా సబర్వాల్​

అప్పుడే ఆదర్శ గ్రామం

దేశంలోనే దళిత బంధు పథకం విప్లవాత్మకమైన పథకమని స్మితా సబర్వాల్​ అన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత లబ్ధిదారులపైనే ఉందని స్పష్టం చేశారు. గ్రామస్థులంతా ఐకమత్యంగా ఉంటే వాసాలమర్రి ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సీఎంఓ కార్యదర్శి రాహుల్ బొజ్జ, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, పంచాయతీ రాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు. పైలెట్​ ప్రాజెక్టుగా గతేడాది సెప్టెంబరులో వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేశారు. 66 మంది లబ్ధిదారులకు రూ. 10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నగదు ద్వారా లబ్ధిదారులు వ్యాపారరంగంలోకి అడుగిడాలని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయం, కోళ్ల పెంపకం, డెయిరీ ఫామ్​ తదితర రంగాలకు ఈ డబ్బును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇదీ చదవండి:MP Arvind Comments: 'పక్కా ప్రణాళికతోనే దాడి.. నా ప్రాణాలకు రక్షణ లేదు..'

ABOUT THE AUTHOR

...view details