మహిళా శక్తిని మించిన శక్తి ప్రపంచంలో మరొకటి లేదని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మహిళల భద్రత కోసం ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారులతో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కోర్ గ్రూపు కమిటీ సమావేశం భువనగిరి డాల్పిన్ హోటల్లో ఏర్పాటు చేశారు.
సలహాలు..
మహిళలకు అత్యవసర సహాయం కోసం, భద్రత కోసం ఏర్పాటు చేసిన డయల్ 100, 181 తదితర హైల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి, సలహాలు, సూచనలు గురించి... కమిటీ సభ్యులను అడిగి స్మిత తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళా భద్రతతో ఉండేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో... భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు స్మిత పేర్కొన్నారు.
కలెక్టర్లు స్పందించాలి..
మహిళలు భద్రత, రక్షణ కోసం హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భరోసాతో పాటు చేపట్టాల్సిన చర్యలను... క్షేత్ర స్థాయిలో తెలుసుకొని నివేదికను రూపొందిస్తామని వెల్లడించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే షీ-టీమ్స్ ఏర్పాటైనట్లు గుర్తు చేశారు. ఉద్యోగులు పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే.. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా స్పందించి... తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో సర్క్యులర్ ఆదేశాలు ఉన్నందున బాధ్యులను అక్కడిక్కడే సస్పెండ్ చేయడంతోపాటు... శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:మహిళలకు భరోసా... పోకిరీలపై షీ టీమ్స్ ఉక్కుపాదం