యాదాద్రి (Yadadri) అభివృద్ధి పనులను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి (Cmo) భూపాల్ రెడ్డి... జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ (Ytda) వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదటగా యాదగిరిగుట్ట చేరుకున్న సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి… కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద, వలయ రహదారి, రోడ్డు విస్తరణ భవనాల కూల్చివేత, ఏర్పాటు చేస్తున్న కూడలిని (సర్కిల్ రింగ్) పరిశీలించారు.
Yadadri: యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎంఓ
యాదాద్రి (Yadadri) అభివృద్ధి పనులను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి (Cmo) భూపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎంఓతో పాటు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ (Ytda) వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఉన్నారు.
తర్వాత కొండపైకి చేరుకుని ఈఓ ఛాంబర్, గెస్ట్ హౌస్ భవనాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ పనితీరును పరిశీలించారు. ఉత్తరం వైపు గల రథశాల నిర్మాణం, ప్రధాన ఆలయం వద్ద ఫ్లోరింగ్, ఆలయంపై విరజిమ్మే లైటింగ్ కాంతులను, ఇత్తడి దర్శనం వరుసల బిగింపు పనులను క్యూ లైన్ నిర్మాణము ప్రధానాలయం లోపల అనుబంధ శివాలయం తదితర వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
క్షేత్రస్థాయిలో సుమారు రెండు గంటల పాటు పనులన్నీ నిశితంగా పరిశీలించారు. అనంతరం కొండ కింద గండి చెర్ల ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణాలలు, దీక్షపరులమండపం, పుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం, అన్నప్రసాద భవనం, తదితర వాటిని పరిశీలించి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో పనులన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.