యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో భూపాల్ రెడ్డి పరిశీలించారు. ప్రధాన ఆలయం, ప్రెసిడెన్సియల్ సూట్స్, శివాలయం, కొండ కింద గల వలయ రహదారి, రింగు రోడ్డు, పనులు తదితర వాటిని అధికారులతో కలసి పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ పనులన్నింటిని గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జరుగుతున్న పనులపై సీఎంవో అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం తగదని.. త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
యాదాద్రి పనులపై సీఎంవో అసంతృప్తి - యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై సమీక్ష తాజా వార్త
యాదాద్రీశుని ఆలయ నిర్మాణ పనుల విషయంలో సీఎంవో భూపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పున:నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనుల గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Breaking News
అనంతరం యాదాద్రి కొండపైన గల హరిత టూరిజంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎంవో భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యాడ వైస్ చైర్మన్ కిషన్ రావు, వైటీడీఎ వైస్ ఛైర్మన్, ఆలయ స్తపతి ఆనందచారి వేలు, ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఆలయ ఆర్కిటెక్ ఆనంద్ సాయి, ఆలయ ఈఓ గీతారెడ్డి హాజరయ్యారు.
ఇవీ చూడండి:'69 ఏళ్ల వయసులో ఆ బామ్మ సత్తా చూడండి'