తెలంగాణ

telangana

ETV Bharat / state

వాసాలమర్రిలో కేసీఆర్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎం ఓఎస్డీ ఆరా - యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్​ పర్యటన

యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఈనెల 22న సీఎం కేసీఆర్​ పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​, కలెక్టర్​ పమేలా సత్పతి.. ఏర్పాట్లను పరిశీలించారు. వాసాలమర్రిని సీఎం దత్తత తీసుకొనే విషయమై అదే రోజు స్పష్టత రానుంది.

cm osd priyanka vargis
cm isd visit at vasalamarri

By

Published : Jun 20, 2021, 10:52 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా.. అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామంలో సభకు, సహపంక్తి భోజనాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. సీఎం రాక నేపథ్యంలో గ్రామంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేశారు.

సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్​, కలెక్టర్​ పమేలా సత్పతి పరిశీలించారు. ఏర్పాట్లు పరిశీలించారు. గ్రామస్థుల మాత్రమే సభకు హాజరయ్యేలా ప్రత్యేక పాస్​లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని.. అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 22న సీఎం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొనే విషయమై అదేరోజు స్పష్టత రానుంది.

ఇవీచూడండి:Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ

ABOUT THE AUTHOR

...view details