ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన.... స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం... బంగారాన్ని విరాళంగా సమర్పిస్తారు. ఉదయం పదిన్నరకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలోబయలుదేరి 11.30కి యాదాద్రికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు.
కాసేపట్లో యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
15:22 September 29
కాసేపట్లో యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానాలయ దివ్య విమానగోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలో కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆ దిశగా^ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పుత్తడిని సమమర్పించారు. తానూ కిలో16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సీఎం.. ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనపై సమాలోచనల నేపథ్యంలో యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేస్తున్న కేసీఆర్.... దసరాకంటే ముందే సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకునే అవకాశం ఉంది.
ఇష్టదేవుడి దర్శనానికి వచ్చేభక్తులకు...... యాదాద్రిలో పలుసమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపటి హనుమకొండ జిల్లా పర్యటన ఖరారైంది. శనివారం ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.15 నిమిషాలకు హనుమకొండకు చేరుకుంటారు. అక్కడ ములుగురోడ్డులోని ప్రతిమ రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను.... కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇవీ చూడండి: