యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ మరోసారి పర్యటించనున్నారు. రేపు వాసాలమర్రిలోని ఎస్సీవాడకు వెళ్లనున్నారు. అనంతరం రైతువేదికలో 130 మందితో సమావేశంకానున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనకు వాసాలమర్రిలో అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.
CM KCR: రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
12:03 August 03
CM KCR: రేపు వాసాలమర్రికి ముఖ్యమంత్రి కేసీఆర్
గత జూన్ 22న వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్.. ఆ ఊరి ప్రజలకు దిశానిర్దేశం చేశారు. వారానికి రెండుగంటల పాటు కష్టపడితే బంగారు వాసాలమర్రి (Vasalamarri)ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, వ్యవసాయం ఇలా అన్నింటికీ కమిటీలు ఏర్పడితే.. అభివృద్ధి చెందడం కష్టం కాదని ముఖ్యమంత్రి (Cm Kcr) అన్నారు. జూన్ 22 మధ్యాహ్నం ఒంటి గంట 18 నిమిషాలకు పల్లెకు చేరుకున్న ఆయన... గ్రామసభ వేదిక పైనుంచి అభివాదం చేసిన అనంతరం గ్రామస్థులందరితో సహపంక్తి భోజనం చేశారు. రెండు గంటల పాటు భోజనశాల వద్దే గడిపారు.
అలాగే ఊర్లోని వాళ్లందరి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్య, ఆర్థిక వివరాలు నమోదు చేయాలన్నారు. వాటన్నింటికి పరిష్కారం చూపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని వాసాలమర్రికి బాధ్యురాలిగా నియమిస్తూ కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఆగమ్మ సైతం కేసీఆర్‌కు తన కష్టాలు చెప్పుకున్నారు. పెద్దకొడుకులా బాధలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వాసాలమర్రిని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడం అదృష్టమని స్థానికులు భావిస్తున్నారు. సీఎం చెప్పిన విధంగా నడుచుకొని బంగారు వాసాలమర్రిగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి:GRMB MEETING: ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి : తెలంగాణ