ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ - తెలంగాణ వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.

యాదాద్రి బయల్దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించగా...ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్ల వరకు ఖర్చయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు జిల్లా కలెక్టర్, అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
ఇదీ చదవండి:నిండు కుండలా లోయర్ మానేరు డ్యామ్
Last Updated : Mar 4, 2021, 1:57 PM IST