తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి : సీఎం కేసీఆర్​

CM KCR Speech in BRS Public Meeting at Aleru : కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరే ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ హేళన చేశారు. ఆలేరులో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ కచ్చితంగా బీఆర్​ఎస్​ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని.. మాట్లాడారు.

BRS Public Meeting at Aleru
CM KCR Speech in BRS Public Meeting at Aleru

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 6:38 PM IST

Updated : Oct 29, 2023, 7:47 PM IST

CM KCR Speech in BRS Public Meeting at Aleru : ఆలేరు ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ బీఆర్​ఎస్​ గెలుస్తుందనే నిర్ణయానికి వచ్చానని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR)​ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందు ఆలేరు పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోండని సూచించారు. ఎన్నికలు వస్తే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటేయండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటేయ్యాలని.. అందరి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీకే ఓటు వేయాలని సీఎం కేసీఆర్(CM KCR Election Camapaign) సూచించారు. రాష్ట్రం ఇస్తే తమకు పరిపాలన చేయడం చేతకాదని ఆనాడు పాలకులు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు భారతదేశంలో తెలంగాణలో తప్ప 24 గంటలు కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని తెలియజేశారు. ఆఖరికి ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్​లో కూడా 24 గంటల కరెంటును ఇవ్వడం లేదన్నారు.

CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి​ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారు : సీఎం కేసీఆర్

CM KCR Election Campaign at Aleru : రాష్ట్రం రాకముందు వలసలు, కరవు పరిస్థితులు ఉండేవని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ తెలిపారు. కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరే ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవని హేళన చేశారు. ఇప్పుడు బీఆర్​ఎస్​ హయాంలో చెరువులు బాగు చేసుకున్నామన్నారు. గత నాలుగేళ్ల నుంచి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని వివరించారు. రైతులకు 3 గంటల కరెంటు చాలు అని రేవంత్​ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంటు కావాలో.. 3 గంటల కరెంటు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. 24 గంటల కరెంటు కావాలంటే తప్పక బీఆర్​ఎస్​ గెలవాల్సిందేనని అన్నారు.

"ఎన్నికలో నాయకుల గెలుపు కాదు.. ప్రజల గెలుపు అనేది ప్రారంభం కావాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. అందరి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఏదీ అనేది మీరందరూ ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాను. కేటీఆర్​ నీవు కావాలంటే కర్ణాటకకు వచ్చి చూడు.. ఐదు గంటల కరెంటు ఇస్తున్నాము అంటున్నారు. 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రానికి వచ్చి చెబుతున్నారు. మిమ్మల్ని ఏమి అనాలి. తెలంగాణ రాకముందు కేవలం 30 లక్షల టన్నుల వడ్లు పండితే.. ఈరోజు 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. ధరణి తీసేస్తే రైతుబంధు ఎట్లా వస్తుంది."- కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Praja Ashirvada Sabha at Aleru : రైతుబంధు వృథా అని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అంటున్నారని సీఎం కేసీఆర్​ మండిపడ్డారు. తెలంగాణ రాక ముందు 40 లక్షల టన్నుల ధాన్యం పండేదని.. ప్రస్తుతం 3 కోట్ల టన్నులకు ఉత్పత్తి పెరిగిందన్నారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు.. ధరణి తీసేస్తే రైతు బీమా, రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గతంలో పట్టా కావాలంటే ఏడాది సమయం పట్టేదని.. కాని ప్రస్తుతం ఈ పరిస్థితి లేదన్నారు. పదేళ్ల నుంచి కాంగ్రెస్​ అధికారం లేక ఆకలితో ఉందన్నారు. తాను రైతును కావునే రైతుల బాధలు తెలుసునన్నారు. భూ వివాదాలు ఉండకూడదనే ధరణి పోర్టల్​ను తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.

CM KCR Speech in BRS Public Meeting at Aleru కాంగ్రెస్​ హయాంలో టపాసులు మాదిరి ట్రాన్స్​ఫార్మర్లు పేలుతుండేవి

CM KCR Election Campaign at Thungathurthy : గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి మాట్లాడితే.. నక్సలైట్లు అనేవారు : కేసీఆర్​

BRS Praja Ashirvada Sabha at Kodad : తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్​

Last Updated : Oct 29, 2023, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details